India's foreign exchange reserves: భారతదేశంలో భారీగా తగ్గిన విదేశీ మారకద్రవ్య నిల్వలు..! 12 d ago
డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652,869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్ బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్లకి పరిమితమయ్యాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ..బంగారం నిల్వలు 1121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRS) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించడానికి కారణాలు..
యూఎస్ డాలర్ విలువ పెరగడం, దేశీయ దిగుమతులు అధికమవ్వడంతో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తులకు డాలర్లలోనే చెల్లించాల్సిరావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కాలంలో కీలక వడ్డీరేట్లను తగ్గించడం.